బిట్ మైన్ ఇమర్షన్ టెక్నాలజీస్ (BitMine Immersion Technologies) సంస్థ తన ఈథర్ (Ethereum) కలెక్షన్‌ను గణనీయంగా పెంచి ప్రస్తుతం 2.83 మిలియన్ ETH టోకెన్లను కలిగి ఉంది. ఇది మొత్తం ఈథర్ సప్లైలో 2% కంటే ఎక్కువగా ఉండగా, వీరి దీర్ఘకాలిక లక్ష్యం ప్రస్తుతంలో ఉన్న సరఫరాలో 5% వరకు నియంత్రణ సాధించడమే. సంస్థ యుద్ద తీరుతో ETH కొనుగోళ్లు చేపట్టడంతో, BitMine Immersion ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఈథర్ ట్రెజరీగా నిలిచింది.
2025 అక్టోబర్ నాటికి BitMine మొత్తం క్రిప్టో కరెన్సీ మరియు క్యాష్ హోల్డింగ్స్ విలువ $13.4 బిలియన్‌కు చేరింది. ఇందులో 2,830,151 ETH (ప్రతి టోకెన్ ధర సుమారు $4,535), 192 బిట్‌కాయిన్, $456 మిలియన్ క్యాష్ మరియు ఇతర క్రిప్టోలోని స్టేక్స్ ఉన్నాయి. ARK యొక్క Cathie Wood, Galaxy Digital, Founders Fund, Kraken వంటి ప్రముఖ వ్యూహాత్మక ఇన్వెస్టర్లు సంస్థను బలంగా మద్దతు ఇస్తున్నారు.
ఈ కంపెనీ అమెరికాలోని 28వ అత్యధిక ట్రేడింగ్ స్టాక్‌గా ఉంది, 5రోజుల సగటు డైలీ వాల్యూమ్ $2.5 బిలియన్ ఉందని సమాచారాన్ని మీడియా వెల్లడించింది. రాబోయే కాలంలో 5% ETH మార్కెట్ విస్తరణ లక్ష్యంగా BitMine ముందు సాగుతోంది. కంపెనీ ప్రస్తుతం బిట్‌కాయిన్ ట్రెజరీలుగా పేరు పొందిన Strategy వంటి సంస్థల నడకన నడుచుకుంటూ, కార్పొరేట్ స్థాయిలో ETH నిల్వలతో కొత్త ట్రెండ్‌ను ప్రదర్శిస్తోంది.
అంతర్జాతీయ స్థాయి విశ్లేషకులు, ETH ETFలు, డిఫై, వెబ్3 అడ్డా వృద్ధి వల్ల ఈథర్ రేటు $7,000-12,000 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి BitMine కొనుగోళ్లు, సంస్థాగత మద్దతు, స్థిరమైన క్యాష్ ఫ్లో కీలక కారణాలని మార్కెట్ భాగస్వాములు చెబుతున్నారు







