నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ వద్ద భారీ దుమారం रేపుతోంది. మొదటి వీకెండ్ (శుక్రవారం–ఆదివారం)లో దేశీయ మార్కెట్‌లో కలిపి దాదాపు ₹61 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు తెలుపుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే సుమారు ₹15 కోట్లు నెట్ రాబడి తెచ్చి, వీకెండ్ ట్రెండ్ బలంగా కొనసాగుతున్నట్లు చూపించింది.
2025లో టాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ వీకెండ్ లిస్టులో ‘అఖండ 2’ ప్రస్తుతం 4వ స్థానంలో నిలిచింది. పాన్ ఇండియా విడుదల, మాస్ టాక్, సింగిల్ స్క్రీన్లలో అభిమానుల హంగామా, ఆంధ్ర–తెలంగాణతో పాటు కర్ణాటక, ఉత్తర ప్రాంతాల్లో కూడా మంచి ఆఫ్‌టేక్ ఈ ఫిగర్లు సాధించడానికి దోహదపడినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మొదటి రోజు మిక్స్డ్ రివ్యూలున్నా, శనివారం, ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్, బాలయ్య ఫ్యాన్స్ థియేటర్లకు ఎక్కువగా రావడంతో వర్డ్–ఆఫ్–మౌత్ స్థిరంగా మారింది. ఇక వచ్చే వర్కింగ్ డేస్‌లో హోల్డ్ ఎలా ఉంటుందనే దానిపైనే, ఈ సినిమా ₹100 కోట్లు నెట్ మార్క్ దిశగా దూసుకుపోతుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.










