మాస్ మహారాజ రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్ కథానాయికగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ని మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. సరేగమా తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో లిరికల్ వీడియోగా విడుదలైన ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మాస్–మెలోడి ఫ్యూజన్ సాంగ్‌లో రవితేజ–ఆషికా జంట క్యూట్ రొమాన్స్, ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్పులతో కనెక్ట్ అవుతున్నారు. సురేష్ గంగులా లిరిక్స్ రాసిన ఈ పాటను నకాష్ అజీజ్, రోహిణి తమదైన స్టైల్‌లో పాడుతూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
పాట లోకేషన్‌లు, కలర్‌ఫుల్ విజువల్స్, సెఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఫుల్ ఫెస్టివ్ వైబ్ కనిపిస్తోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో డింపుల్ హయాతి, సునీల్, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. సంక్రాంతి 2026కి థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది, మొదటి సింగిల్‌తోనే సినిమాపై బజ్ మరింత పెరిగింది










