ప్రభాస్ 23 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని, డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న “ది రాజా సాబ్” చిత్రానికి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రభాస్ అభిమానుల్లో విశేషంగా ఆసక్తిని రేపుతోంది.
“ది రాజా సాబ్” ఓ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా. ఇందులో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లీడ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, IVY ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, జనవరి 9, 2026 సంక్రాంతికి వరల్డ్ వైడ్ థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం, రాజాసాబ్ మహల్‌లో అద్దిరిపోయే సెట్టింగ్‌లు, మరియు మెగా స్టార్ క్యాస్టింగ్ ఫ్యాన్స్ కి పండగగా ఉండబోతోంది. మారుతి – ప్రభాస్ కాంబినేషన్ తొలిసారి వస్తున్న చిత్రం కావడంతో టాలీవుడ్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ పోస్టర్ విడుదలకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కు శుభాకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.
23 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ మారుతి విడుదల చేసిన ప్రభాస్ న్యూ పోస్టర్‌కి ఫ్యాన్స్ పెద్దగా స్పందిస్తున్నారు.










