రామ్ పోతినేని నటిస్తున్న బయోపిక్ “ఆంధ్ర కింగ్ తాలూకా” చిత్రం విడుదల తేదీ ముందుకు మార్చబడింది. మొదట ఈ సినిమా నవంబర్ 28న ఉన్నను, తాజా ప్రకటన ప్రకారం ఒక రోజు ముందుగానే—నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, కీలక పాత్రల్లో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కనిపించనున్నారు.
ఈ బయోపిక్ ఒక సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్ తెచ్చుకున్నాయి. ట్రైలర్‌ను కర్నూలులో ఈ నెల 18న విడుదల చేయనున్నారు.
ఈ తాజా షెడ్యూల్ మార్పు కోసం రామ్ డైరెక్టర్‌తోపాటు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకైతే ఈ అప్‌డేట్ ముందుగా పండుగ కావడమే.









