పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి మొదటి పాట ప్రోమోకి అధికారిక డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 9, 2025 సాయంత్రం 6:30 గంటలకు సోనీ మ్యూజిక్ సౌత్ చానల్‌పై ప్రోమో విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది.
ఎనర్జిటిక్ డ్యాన్స్ పోజ్‌లో పవన్ కళ్యాణ్ కనిపించే స్టైలిష్ పోస్టర్‌తో ప్రకటన చేసిన మేకర్స్, “మీరు ప్రేమించిన పవర్‌స్టార్‌ని మరింత ఎనర్జీ, అసమాన యాటిట్యూడ్, బ్లాస్టింగ్ మూవ్స్‌తో అందిస్తున్నాము” అంటూ అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విశాల్ దడ్లాని గాత్రం, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యంతో ఈ పాట మాస్ ఎంటర్‌టైనర్‌గా రానుందని టీజర్ మేకింగ్ గ్లింప్స్ ఇప్పటికే సూచిస్తున్నాయి.
‘గబ్బర్ సింగ్’ హిట్ కాంబో మళ్లీ కలిసి తెరకెక్కించిన ఈ కాప్ యాక్షన్ డ్రామాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా సందడి చేస్తున్నారు. మార్చి 26, 2026 వరల్డ్‌వైడ్ రిలీజ్ ప్లాన్‌తో పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా సాగుతున్న ఈ చిత్రానికి ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తూ ఎదురుచూస్తున్నారు.










