సాఫ్ట్‌బ్యాంక్ బ్యాక్డ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో ₹5,421 కోట్ల IPOని డిసెంబర్ 3 నుండి 5 వరకు ఓపెన్ చేయనుంది. ధర బ్యాండ్ ₹105-111 ప్రతి షేర్. ఫ్రెష్ ఇష్యూ ₹4,250 కోట్లు, OFSలో 10.55 కోట్ల షేర్లు (₹1,171 కోట్లు). అప్పర్ ఎండ్‌లో మీషో వాల్యుయేషన్ ₹50,096 కోట్లు ($5.6 బిలియన్‌లు)..
ఎలివేషన్ క్యాపిటల్, పీక్ XV, వెంచర్ హైవే, Y కాంబినేటర్, ఫౌండర్లు విదిత్ ఆత్రే, సంజీవ్ కుమార్ OFSలో షేర్లు అమ్ముతారు. ఫ్రెష్ ఇష్యూ డబ్బులు క్లౌడ్ ఇన్‌ఫ్రా, మార్కెటింగ్, ఇన్‌ఆర్గానిక్ గ్రోత్, కార్పొరేట్ పర్పసెస్‌కు వాడతారు.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్స్‌కు 75%, నాన్-ఇన్‌స్టిట్యూషనల్‌కు 15%, రిటైల్‌కు 10% కోటా. లాట్ సైజ్ 135 షేర్లు (సుమారు ₹14,385-₹15,000). యాంకర్ ఇన్వెస్టర్లు డిసెంబర్ 2న బిడ్, అలాట్‌మెంట్ డిసెంబర్ 8, డీమ్యాట్ క్రెడిట్ 9, లిస్టింగ్ 10న BSE, NSEలో.
FY25లో మీషో లాసెస్ రిపోర్ట్ చేసింది, EPS నెగటివ్. సెప్టెంబర్ 2025 వరకు 234.2 మిలియన్ యూజర్లు, 1,261 మిలియన్ ఆర్డర్లు, 706,471 సెల్లర్లు. పీర్ల P/E 399x అయినా మీషో గ్రోత్ పొటెన్షియల్ హైలైట్. కోటక్ మహిన్ద్రా, JP మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ బుక్ రన్నర్లు










