భారత స్టాక్ మార్కెట్లు అక్టోబర్ 9, 2025న పాజిటివ్ నోట్లో ముగిశాయి, సెన్సెక్స్ రూ. 398 పాయింట్లు పెరిగి 82,172.10 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 సైతం 136 పాయింట్ల లాభంతో 25,182కు చేరుకుంది. ఈ లాభాలకు ప్రధానంగా IT, ఫార్మా, మెటల్ స్టాక్స్ దోహదమయ్యాయి. మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ మంచి పెరుగుదలను చూపించాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల భయాలు తగ్గిపోవడం, కొద్ది రోజులుగా కొనుగోళ్లు పెరగడం వంటి కారణాలు భారత మార్కెట్లకు పాజిటివ్ దిశలో ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయంలో రెండు సూచీలు వారాంతపు గరిష్ట స్థాయిని నమోదు చేశాయి
సెన్సెక్స్ 398 పాయింట్లు ఎగిసి 82,172కి, నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో 25,182 వద్ద ముగింపు







