భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రామాయపట్నం పోర్ట్ సమీపంలో రూ.95,000 కోట్లతో నూతన గ్రిన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ప్రీ-ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతిపాదిత యూనిట్ సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతుంది. దీనివల్ల భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలకు నిలబడడమే కాక, దేశంలోని పెట్రోకెమికల్ సామర్థ్యాలను పెంచడంలో కూడా కీలక పాత్రపోషిస్తుంది.
ప్రాజెక్టు పూర్తయితే, BPCL పెట్రోకెమికల్స్ లో తన పోర్ట్ఫోలియోను మరింత విస్తృతం చేయగలదు. అందువల్ల, దీర్ఘకాలికంగా పెట్రోలియం ఉత్పత్తి వ్యాపారానికి సహజ రక్షణగా మారుతుంది. భవిష్యత్తులో ఇండియా గ్లోబల్ రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధిచేసే ప్రయత్నంలో భాగంగా ఇది తీసుకున్నది.
భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు కావడం, 2030 నాటికి రోజుకు మరో 10 లక్షల బ్యారెళ్ళ చమురు అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రామాయపట్నం ప్రాజెక్ట్ BPCL యొక్క ప్రాజెక్ట్ “Aspire” కింద ఆవిష్కరించబడింది. దీంతో పాటు కంపెనీ తన రెన్యూవబుల్స్, గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయెల్స్ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రామాయపట్నం వద్ద 6,000 ఎకరాల భూమిని రిఫైనరీ కోసం పొందేందుకు ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, నేరుగా 5,000 ఉద్యోగాలు, పరోక్షంగా మరికొన్ని వేల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధాకూ, పరిసర ప్రాంతాల ఆర్థిక రంగానికీ కొత్త ఊపిరినిస్తుంది