మంగళగిరి, సెప్టెంబర్ 1 (న్యూస్ డెస్క్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలో అరుదైన ఆనందదాయక దృశ్యం కనిపించింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేశుడిని వ్యాపారుల సహకారంతో రూ.2.35 కోట్ల విలువైన తాజా కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు.
పది రూపాయిల నుండి అయిదు వందల వరకు రకాల నోట్లతో గణపతి విగ్రహాన్ని మెరిసేలా తీర్చిదిద్దారు. ఒకరోజు మాత్రమే ఈ ప్రత్యేక డిస్ప్లేను భక్తులకు వీక్షనానికి అందుబాటులో ఉంచారు. ఈరోజు ముగిసిన తర్వాత, సంపూర్ణ భద్రతా ఏర్పాట్లతో, డబ్బును మళ్లీ వ్యాపారులకు తిరిగి అందజేస్తారు. వ్యాపారి సంఘాల సహకారం, ప్రణాళికాత్మక నిర్వహణ ద్వారా ఈ అరుదైన కరెన్సీ అలంకరణ సాధ్యమైంది.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూనే, ఈసారి అత్యధికంగా రూ.2.35 కోట్ల నోట్లతో గణేశుడి అలంకరణచేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు గణేశుని దర్శనం చేసుకొని ఉల్లాసంగా వేడుకను ఆచరించారు