కియా సెల్టోస్ 2వ తరం మోడల్ పూర్తి గ్లోబల్ రివెల్ డిసెంబర్ 10కి ముందు తాజా స్పై షాట్స్ ద్వారా ఇంటీరియర్ వివరాలు బయటపడ్డాయి. ఈ కొత్త SUVలో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ + డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ చార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లు కనిపిస్తున్నాయి.
క్యాబిన్ డిజైన్ మినిమలిస్టిక్‌గా ఉండగా, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, అంబియెంట్ లైటింగ్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌లో కప్ హోల్డర్స్, సెంటర్ కన్సోల్‌లో రొటరీ డయల్‌తో గేర్ సెలెక్టర్ కనిపిస్తున్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో ఎయిర్ వెంట్స్, స్టీరింగ్ వీల్‌లో మల్టీ-ఫంక్షన్ బటన్లు, హై-క్వాలిటీ ఫినిషింగ్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
ఇంజిన్ ఆప్షన్లలో 1.5L టర్బో పెట్రోల్ (160hp), 1.6L డీజిల్ (134hp)తో 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్, ADAS లెవల్-2, 360° కెమెరా, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటివి ఉండనున్నాయి. భారతదేశంలో 2026 మొదట్లో లాంచ్ అవ్వనున్న ఈ సెల్టోస్, హ్యుండై క్రెటా, మారుతి గ్రాండ్ విటారా పోటీకి సిద్ధమవుతోంది.










