మహీంద్రా తన పాపులర్ XUV700 ఫేస్‌లిఫ్ట్‌కి అధికారికంగా కొత్త పేరు ప్రకటించింది, ఇక నుంచి ఈ అప్‌డేట్‌డ్ వెర్షన్‌ను XUV 7XO పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. తాజా టీజ్ ప్రకారం, ఈ కొత్త SUV వరల్డ్ డెబ్యూ జనవరి 5, 2026న జరగనుండగా, డిజైన్, టెక్నాలజీ, కంఫర్ట్ పరంగా గణనీయమైన మార్పులు ఉండనున్నాయని కంపెనీ హింట్ ఇచ్చింది.
డిజైన్ పరంగా ముందు భాగంలో కొత్త LED హెడ్‌ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), రీడిజైన్ చేసిన గ్రిల్, వెనుక భాగంలో L-షేప్ LED టెయిల్‌ల్యాంప్స్ వంటి ఫ్రెష్ లుక్ ఇవ్వబోతున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ఇంటీరియర్‌లో ట్రిపుల్-స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త కలర్ స్కీమ్, అప్‌గ్రేడ్ చేసిన ఇన్ఫొటైన్‌మెంట్, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి ఉండే అవకాశం ఉంది.
ఇంజిన్ సెటప్ విషయానికి వస్తే, ప్రస్తుత XUV700లో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశముంది, వీటికి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండవచ్చు. SUV సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, ఈ ఫేస్‌లిఫ్ట్ ద్వారా మరింత టెక్-ఫోకస్, ప్రీమియం ఇమేజ్‌తో మార్కెట్‌లో హైప్ క్రియేట్ చేయాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.










