OnePlus 15 మోడల్‌లో సంస్థ తన స్వంతంగా అభివృద్ధి చేసిన కెమెరా ఇంజిన్‌ను పరిచయం చేయనున్నట్లు లీక్స్ వెల్లడించాయి. ఇది ఈ ఫోన్ ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెట్ మరియు Snapdragon 8 Elite 2 ఛిప్‌సెట్‌తో కలిసి పనిచేసి, ఫోటోగ్రఫీని మరింత విప్లవాత్మకంగా మార్చే అవకాశం ఉంది.
ఈ కొత్త ఇంజిన్ ద్వారా చిత్రాల ఖచ్చితత్వం, వేగం, కలర్ ప్రాసెసింగ్ మెరుగుపడడంతోపాటు, నైట్ షాట్స్, జూమ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఉత్తమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. OnePlus 15లో 6.78 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అధునాతన హార్డ్వేర్ ఫీచర్లు తప్పక ఉంటాయి.
ఫోన్ 2025 అక్టోబర్‌లో చైనాలో ప్రదర్శింపబడతుందని, ఇండియాలో 2026 మొదట్లో విడుదలవుతుందని అంచనా. మరోవైపు OnePlus 15R మోడల్ కూడా సందడి చేయనుంది.
కొత్త కెమెరా ఇంజిన్, అధునాతన CPU సామర్థ్యం OnePlus తరుణంలో హై ఎండ్ వినియోగదారులకు ఆకర్షణీయంగా మారబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు