OnePlus తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ని అక్టోబర్‌లో చైనాలో లాంచ్ చేస్తుందని అధికారికంగా చేసింది. ఈ డివైస్ Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో అందుబాటులో ఉంటుంది. “Sand Dune” అనే కొత్త రంగులో విడుదల కానుంది.
OnePlus 15లో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది, దీని రిఫ్రెష్ రేట్ 165 Hz. గాడ్జెట్‌లో ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో Sony LYT-808 ప్రాథమిక సెన్సార్, Samsung JN5 సెన్సార్‌లు ఉంటాయి. 3.5x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌ను DetailMax ఇమేజ్ ఇంజిన్ ప్రోత్సహిస్తుంది.
పని వేగవంతం చేసేందుకు ఈ ఫోనులో 16GB RAM మరియు 512GB స్టోరేజ్ ఇది Android 16 ఆధారిత OxygenOS 16 పై పని చేస్తుంది. 7,000mAh భారీ బ్యాటరీ 120W వార్డెడ్ మరియు 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
OnePlus 15లో నానో-సిరామిక్ మిడ్-ఫ్రేమ్ ఉంటుంది, ఇది తేలికపాటి మరియు ప్రీమియమ్ ఫీల్ ఇస్తుంది. హాసెల్బ్లాడ్ కెమెరా బ్రాండింగ్‌ను తొలగించి, కంపెనీ తమ స్వంత DetailMax కెమెరా ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చింది.
చైనా మార్కెట్‌లో అక్టోబర్ 27న విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో వచ్చే సంవత్సరంవరకు లేదా ఈ సంవత్సరం చివరికి విడుదల కావొచ్చు. ధర గురించి అధికారిక సమాచారం తెలియకపోయినా, ఇది OnePlus 13తో సమానమైన స్థాయిలో ఉండేలా ఉంటుంది.







