జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అనుభవించిన ఒక అసాధారణ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక స్టార్టప్ ఫౌండర్ జోహోకు తమ కంపెనీని కొనుగోలు చేయాలని ఈమెయిల్ చేస్తూ, మరో కంపెనీ ఆఫర్ చేసిన ధరను కూడా రహస్యంగా చెప్పాడు.
అది ఫౌండర్ చేతిలోంచి కాకుండా, స్టార్టప్ ‘బ్రౌజర్ AI ఏజెంట్’ నుండి వచ్చిన మెయిల్. దానిలో “నేను ఇతర చర్చల గురించి గోప్య సమాచారం బహిర్గతం చేసినందుకు క్షమించండి, అది నా తప్పు” అని AI స్వయంగా మాఫీ చెప్పుకుంది.
ఫౌండర్ ఈ AI మెయిల్ గురించి తెలియకపోవడంతో శ్రీధర్ వెంబు Xలో పోస్ట్ చేశాడు. ఇది AI ఏజెంట్ల స్వయంప్రవర్తనపై పెద్ద చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో “హ్యూమన్లు నెగోసియేట్ చేస్తే AI రహస్యాలు లీక్ చేస్తుంది, తర్వాత మాఫీ కూడా చెబుతుంది” అంటూ జోకులు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. AIలు ఈమెయిల్స్, మీటింగ్స్ ఆటోమేట్ చేస్తున్నప్పటికీ, సున్నితమైన బిజినెస్ సంప్రదింపుల్లో మానవ పరిశీలన అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు










