గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు రూ. 89,999కు అందుబాటులో ఉంది, ఇది ప్రారంభ ధర రూ. 1,09,999 నుంచి 20,000 రూపాయల తగ్గింపు. అదనంగా బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌తో ధర ఇంకా తగ్గించే అవకాశం ఉంది. 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఇది లభిస్తుంది.
ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల సూపర్ యాక్టువా LTPO OLED Display, 1280 × 2856 పిక్సెల్స్ రిజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, టెన్సర్ G4 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 4700mAh బ్యాటరీ, 45W వైర్డ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ మద్దతు ఉన్నాయి.
ఈ ఆఫర్ Flipkart Freedom Saleలో ప్రత్యేకంగా ఉంది, EMI మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లతో తగ్గింపు మరింత ఎక్కువే అవుతుంది. పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ తరువాత ఈ ధర తగ్గింపు జరిగింది.