అమెరికా టెక్ కంపెనీలు భారీ AI పెట్టుబడుల మధ్య విదేశీ పుట్టిన టాలెంట్‌ను ఆగ్రెసివ్‌గా హైర్ చేస్తున్నాయి. AI రీసెర్చ్, జనరేటివ్ AI ప్రొడక్ట్స్, డేటా సెంటర్ ఆపరేషన్లకు అవసరమైన హై-స్కిల్ ఇంజినీర్ల కోసం గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజాలు వేలాది H-1B, ఇతర వీసాలపై ఆధారపడుతున్నాయి.
NFAP రిపోర్ట్ ప్రకారం FY 2025లో కొత్త H-1B అప్రూవల్‌ల టాప్ లిస్టులో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ముందంజలో నిలిచాయి; ఇండియన్ IT కంపెనీల H-1B షేర్ 10ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇది సాంప్రదాయ అవుట్‌సోర్సింగ్ మోడల్ నుంచి, USలోనే ఇన్-హౌస్ AI డెవలప్‌మెంట్ వైపు మలుపు తిరుగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఇక ట్రంప్ ప్రభుత్వ $100,000 కొత్త H-1B ఫీజు కారణంగా స్టార్ట్‌అప్స్, చిన్న కంపెనీలు టాలెంట్‌ను USకి తీసుకురావడం కష్టమవుతుండగా, బిగ్ టెక్ మాత్రం హై-వాల్యూ AI రోల్స్‌కి మాత్రమే అత్యుత్తమ విదేశీ టాలెంట్‌ను ఎంపిక చేస్తోంది. మిగతా కంపెనీలు రిమోట్ వర్క్, ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్లు, O-1 వంటి ప్రత్యామ్నాయ వీసా ఆప్షన్‌లను వినియోగించుకుంటున్నాయి.
ఇండియన్, చైనీస్ ఇంజినీర్లు, US విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులు AI, క్లౌడ్, చిప్ డిజైన్, రోబోటిక్స్ రంగాల్లో కీలక శక్తిగా మారారు. US AI రేసులో తన లీడర్‌షిప్‌ను నిలబెట్టుకోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ మైండ్స్‌ను ఆకర్షించడమే తన ప్రధాన బలమని నిపుణులు సూచిస్తున్నారు










